Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూల్చివేత నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం వెనక్కు తీసుకోవాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థకు అభివృద్దికి రక్తం చిందించి, సేవలందించి పదవి విరమణ పొందిన మాజీ కార్మికులను, సంస్థపై పరోక్షంగా ఆధారపడిన పేదలను నిర్వాసితులను చేయడం సింగరేణి యాజమాన్యానికి తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. పట్టణంలోని బర్మాక్యాంపు ఏరియాలో మాజీ కార్మికులు, ఇతర నిరుపేదను నివాసముంటున్న క్వార్టార్లను, సొంతగా నిర్మించుకున్న ఇండ్లను సింగరేణి యాజమాన్యం కూల్చివేతకు పూనుకోవడం సరైంది కాదన్నారు. శుక్రవారం స్థానిక శేషగిరిభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ పుట్టుక నుంచి సంస్థలో పనిచేసిన వందలాది మంది మాజీ కార్మికులు, సంస్థపై పరోక్షంగా ఆధారపడిన పేద కుటుంబాలు, మాజీ కార్మికుల వారసులు బర్మా క్యాంపు ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంపై మక్కువ పెంచుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్లలేక సంస్థ నిర్మించిన క్వార్టర్లలో నివసిస్తున్నారని, ఇదే ప్రాంతంలో కొందరు ఇండ్లు నిర్మించుకో నివసిస్తున ా్నరని, వీరిని ఖాళీ చేయించే చర్యలకు యాజమాన్యం పూనుకుంద న్నారు. ఈ క్వార్టర్లు, బర్మా క్యాంపు స్థలాలను సింగ రేణి సంస్థకు అవసరంలేన ప్పటికీ కక్ష్య సాధింపుగా క్యార్టార్లను, ఈ ప్రాంతంలోని పేదల స్థిర నివాసా లను కూల్చివేతను నిలుపుదల చేయాలనీ, లేని పక్షంలో బాధితులను సమీకరించి సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.