Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తానా మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్
నవతెలంగాణ-బూర్గంపాడు
క్రీడలతో స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడతాయని తానా మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ అన్నారు. శుక్రవారం తాళ్ళూరి పంచాక్షరయ్య చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్ళూరి భారతి దేవి జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాలతో స్నేహ సంబంధాలు మొరుగుపడతాయని ఆయన అన్నారు.
తాళ్ళూరి భారతీ దేవి జ్ఞాపకార్ధంగా నిర్వ హించిన టోర్నమెంటులో మొదటి బహుమతి రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.15000, అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు డాక్టర్ తాళ్ళూరి రాజా శ్రీకృష్ణ, డా.గొట్టిపాటి అనితారాణి, ఎస్సై పి.సంతోష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సర్పంచులు కోర్స లక్ష్మి, పోతునూరి సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.