Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
పోడు భూములకు ఎటువంటి కొర్రీలు పెట్టకుండా, సాగు చేసుకునే రైతులందరికీ పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని, రెవెన్యూ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు గిరిజన రైతులకు అర్హులైన వారందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, తహసీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మధు, ఆర్ఐ ఎర్రయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ధరణిలోని లోపాలు సరిచేసి ధరణి వెబ్సైట్ ద్వారా ఇచ్చిన పాస్ పుస్తకాల్లోని తప్పొప్పులు సరిచేసి అర్హతలు కలిగిన వారికి వారసత్వం ద్వారా భూమి బధలాయింపులు అర్హులైన వారికి చేయాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, దానికయ్యే వడ్డీ ఖర్చులు ప్రభుత్వ భరించాలన్నారు. సొంత ఇండ్ల జాగా ఉన్నవారికి రూ.ఐదు లక్షలతో ఇల్లు నిర్మించాలని, ఇండ్ల స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజుకూలి రూ.600 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ, రావుల శోభన్ బాబు, కేశవరావు, కొలిగిపోగు శ్రీనివాసరావు, కోరం దుర్గ, పిట్టల పోలమ్మ, మారుతి, సీతారాములు, నాగరాజు, రాఘవులు, మోటేపల్లి ధర్మయ్య, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.