Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలి
- ఏరియా జీఎం జక్కం రమేష్‌కి వినతి పత్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా క్లరికల్ సిబ్బందికి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వినతి పత్రం అందజేశారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ జక్కం రమేష్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొత్తగా నియమించనున్న 141 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలతో పాటు కోర్టు ఆదేశాల అనుసారం నియమించబడిన 22 మంది క్లరికల్ పోస్టులకు మొత్తం 163 ఖాళీలని సీనియారిటీ ఆధారముగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. నూతనంగా చేపట్టబోయే క్లరికల్ ఖాళీల భర్తీ ప్రక్రియకు ముందే సీనియర్ క్లరికల్ వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంధర్భముగా జీఎం మాట్లాడుతూ ఈ విషయం పై యజమాన్యంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.