Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొమ్మెర రాంమూర్తి
నవతెలంగాణ-మధిర
మధిరలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మెర రామ్మూర్తి శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మధిరలో పోటీలో ఉంటా, కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాయి, నేను అసంతృప్తిలో ఉన్న మాట నిజమే... కానీ నా ప్రాణం పోయిన గులాబీ జెండా వదిలిపెట్టనన్నారు. మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీచేసి గులాబీ జెండా ఎగరవేయాలని ఉందన్నారు. మధిర నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లేదే లేదన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో మధిరలో గులాబీ జెండా ఎగరటానికి కృషి చేస్తానని చెప్పారు. మధిరలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొబ్బిళ్ళపాటి బాబురావు, మర్లపాడు సహకార సంఘం వైస్ ఛైర్మన్ తాటి సురేష్, దోర్నాల దినకర్ బాబు, ఆత్కూరు మాజీ ఎంపీటీసీ మీనుగు వెంకటేశ్వర్లు, దంత వైద్యులు లక్ష్మీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.