Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలాన్ని ఒకటే పంచాయతీగా ఉంచాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-భద్రాచలం
ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజించడం వల్ల అనేక సమస్యలు, చిక్కులు వచ్చే అవకాశం ఉంటాయని, భద్రాచలాన్ని ఒకే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజించి తీర్మానం చేయడాని ఆయన తప్పు పట్టారు. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన చేపట్టామని నిరసన కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, పట్టణ బంద్ సైతం నిర్వహించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు అన్నారు. ప్రజా ప్రతినిధుల పాలన లేకపోవడం వల్ల అధికారుల పెత్తనం ఎక్కువయ్యి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, తక్షణమే భద్రాచలం పంచాయతీకి ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, జి.జ్యోతి, జి.లక్ష్మణ్, ఎం.నాగరాజు, సిహెచ్ మాధవ్, శాఖ కార్యదర్శి రామకృష్ణ, కాక రమణ, కనక శ్రీ, నాగలక్ష్మి రమణ, టి.కుమారి తదితరులు పాల్గొన్నారు.