Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది ఎమ్మెల్యేలు మళ్లీ ఓటు అడిగితే పాతరెయ్యండి
- అసెంబ్లీ అడ్డుపెట్టుకొని 9 ఏండ్లుగా పోడు పట్టాలిస్తామంటూ మాయ
- కాంగ్రెస్ సభలకు పోతే పట్టాలు ఇవ్వమని బెదిరింపులు
- సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు కడతామని చేతులెత్తేశారు
- నియోజకవర్గంలో హరిసింగ్ అవినీతి
- ఎన్నికల సభను తలపించిన భారీ పాదయాత్ర బహిరంగ సభ
నవతెలంగాణ-ఇల్లందు
గత తొమ్మిదేళ్లుగా పోడు పట్టాలిస్తామంటూ నిండు అసెంబ్లీలో అనేకసార్లు వాగ్దానాలు చేసిన సీఎం కేసీఆర్ మాటలు నమ్మకండి అని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాజీవ్ నగర్ తండా నుండి శనివారం పట్టణంలోకి పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు నినాదాలతో పట్టణం మారుమోగింది. అనంతరం జగదాంబ సెంటర్లో జరిగిన కార్నర్ బహిరంగ సభలో మాట్లాడారు. సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల కోసమే ఆరో తారీకు నుండి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. ఇల్లందులో అన్ని వర్గాల వారు అనేకమంది తమ వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు చెప్పారని అన్నారు. ములుగు జిల్లాలో పోడుదారులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్యే సీతక్క అడ్డుకున్నారని అన్నారు. ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో పోడుదారులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. మళ్లీ వాటికే కొర్రీలు పెట్టి అడ్డుకుంటున్నారని తెలిపారు. 11.5లక్షల ఎకరాల పోడు పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారని అనేక రకాలుగా మాటలు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభలకు వెళితే పట్టాలు బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తే పాతరె య్యండంటూ పిలుపునిచ్చారు. గిరిజ నులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తావ ుంటూ హామీలిచ్చి తొమ్మిదేళ్లయిన పట్టింపు లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అనేక రకాలుగా మోసం చేశారని అన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరి సింగ్ నాయక్ ఇసుక, ఇటుక కబ్జా భూములతో అవినీతికి పాల్పడు తున్నాడని, 30 శాతం కమీషన్లు ఇవ్వాలంటూ సీతారామ ప్రాజెక్టు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం ఆమోదం ఇవ్వకపోతే సింగరేణి ఆధ్వర్యంలో చేపడతామని కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. పేదలు, విద్యార్థులు రైతులు, ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల వారు సమస్యలతో సతమవుతున్నారని అన్నారు.
2024లో కాంగ్రెస్ పార్టీకే అధికారం
ప్రజలకు ఎన్నికల వరాలు
2024 జనవరి 24న కాంగ్రెస్ పార్టీకే అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోడుదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పొడుపట్టాలిచ్చి ఆదుకుంటామన్నారు. రూ. 5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పంట గిట్టుబాటు ధర కల్పి స్తామన్నారు. 5000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకా యిలు చెల్లిస్తామన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీకి రూ.8 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు.
కేసీఆర్ను ఇంటికి సాగనంపుతాం : ఎమ్మెల్యే సీతక్క
ప్రజల కోసమే యాత్ర చేపట్టామని, కేసీఆర్ను ఇంటికి సాగనంపుతామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజ లకు సేవచేస్తున్నా ఓర్వలేక కొందరు పార్టీ మారిన వాళ్ళు కేసులు పెట్టీస్తున్నారని ఉన్నారు. అసెంబ్లీకి వెళితే సమ స్యలు చెప్పడానికి మైక్ ఇవ్వడం లేదన్నారు. ఈ సభలో మా జీ కేంద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర నేతలు సుధాకర్, రవి, మాజీమంత్రి సంభాని, చందా లింగ య్య నెహ్రూ, నియోజకవర్గ నేతలు దళ్ సింగ్, డాక్టర్ రామచంద్రనా యక్, సైదులు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.