Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలో బ్రూ సెల్లోసిస్ టీకాలు పశువులకి వేయడం జరుగుతుందని దమ్మపేట పశు వైద్యాధికారి డాక్టర్ మన్యం రమేష్ బాబు శనివారం తెలిపారు. శనివారం ఆయన పశువులకు టీకాలు వేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభించామని, 4 నెలల నుంచి 8 నెలల వరకు ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని వివరించారు. 1600 జీవాలకు టీకాలు వేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 910 వరకు వ్యాక్సిన్లు వేయడం జరిగిందని తెలిపారు. మండలంలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని అన్నారు. ఆడదూడలు రాబోవుకాలంలో వాటి పునరుత్పత్తి సమయంలో ఇబ్బందులు జరగకుండా ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్ని మండలంలోని అందరూ పాడి రైతులు ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం వినియోగించుకోవాలని రైతులకు తెలియజేశారు.