Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి తుమ్మల
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అమరజీవి యలమంచి సీతారామయ్య నిబద్దత కలిగిన నాయకుడని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దుమ్ముగూడెం ముత్యా లమ్మ ఆలయ కళ్యాణ మండపం ప్రారంభానికి వచ్చిన ఆయన అమరజీవి సీతారామయ్యను గుర్తు చేశారు. తాను మంత్రిగా పని చేసిన సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సీతారామయ్యను మర్యాదపూర్వకంగా కలిసేవాడిని అని అన్నారు. సీతారామయ్య ఏనాడు రాజకీయాలు మాట్లాడేవారు కాదని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించే వారన్నారు. ఆయన రాజకీయ వారసత్వంగా కుమారులు, మనువళ్లు నిబద్దతతో పని చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ముత్యాలమ్మతల్లి కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో
దుమ్ముగూడెం గ్రామం ఆనాడు బ్రిటీష్ కాలంలో నౌకాయాణంతో వర్తక కేంద్రంగా ఉండేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కళ్యాణమండపంలో మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మళ్లీ అవకాశం వస్తే దుమ్ముగూడెం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎంపిపి రేసు లకీë, ఎస్ఏ రసూల్, యశోదరాంబాబు, మానె రామకృష్ణ, యండి అలీంఖాన్, ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి, సీతారాంపురం ఎంపిటిసి సభ్యులు యలమంచి వంశీకృష్ణ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ యలమంచి శ్రీనుబాబు, నాయకులు సాగి శ్రీనివాసరాజు, మట్టా వెంకటేశ్వరరావు, సుధాకర్ తదితరులు ఉన్నారు.