Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీపీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డికి టీడీపీ వినతి
నవతెలంగాణ-ఇల్లందు
నియోజవర్గం హెడ్ క్వార్టర్ అయిన ఇల్లందును రెవెన్యూ డివిజన్, బోడు, సుదిమల్ల, కొమరారం కొత్త మండలాలు ఏర్పాటుకు సహకరించాలని హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇల్లందుకు విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ, చాందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శనివారం కోరారు. వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఇల్లందుకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. 2016లో జిల్లాలు, కొత్త మండలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇల్లందు జిల్లాతో పాటు రెవిన్యూ డివిజన్, కొత్త మండలాల ఏర్పాటు చేయాలనీ ప్రజల నుండి వచ్చిన డిమాండ్‌ను పక్కన పెట్టి ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాలను మూడు జిల్లాలో కలిపి ఈ నియోజకవర్గంను మూడు ముక్కలు చేసింది అని తెలిపారు. ఈ సమస్య పై తాను మాట్లాడ్తానని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ సమస్యలు పరిస్కారం చేస్తాం అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నాయకులు కారు నర్సన్న, శ్యామ్ తీవరి, వేమూరి సల్మాన్ రాజ్, నూక వెంకటేశ్వర్లు, బాబు, కంది రవి, శిల్ప వెంకటేశ్వర్లు, ముత్యాల రమేష్, రాంగోపాల్ లొద్, గోగేలా రాజేష్, అశోక్, గౌస్ పాల్గొన్నారు.