Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలోని సింగరేణి సంస్థ నిర్మించినటువంటి 39 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ శ్రీనివాస్ బృందం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వారు ఇన్వర్టర్స్, మెయిన్ కంట్రోల్ రూమ్, బ్యాటరీ బ్యాంక్, గ్రిడ్ కనెక్షన్స్, సోలార్ ప్యానల్స్‌ను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెంరాజు, ఏరియా ఇంజనీర్ జి.ప్రభాకర్ రావు, ఎజియం(బి.హేచ్.ఈ.ఎల్) రాంచందర్, డీజీఎం వర్క్ షాప్ శేఖర్ బాబు, డీవైఎస్ఈ వీరానాయక్ తదితరులు పాల్గొన్నారు.