Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
అసెంబ్లీ సమావేశాలలో ఆశ్రమ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న మహిళ సిబ్బంది వేతనాలు, మెస్ చార్జీల పెంచాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహా గురుకులాల ఆశ్రమ పాఠశాలల సిబ్బంది బదిలీలు జరపాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదులో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆదివారం ఆమె పలు సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. అందులో భాగంగా హరిప్రియ మాట్లాడుతూ...ఆశ్రమ పాఠశాలల పనితీరుతో విద్యా ప్రమాణాలు పెరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పెరిగిన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది కూడా తమ వేతనాల పెంపు కొరకు ఆశగా ఎదురుచూస్తున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ తరహాలోనే ఆశ్రమ పాఠశాలల గురుకులాల సిబ్బంది బదిలీలు కూడా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.