Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-బూర్గంపాడు
గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని సారపాక గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఈ పాదయాత్ర జయప్రదం చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆయన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పాదయాత్ర రాష్ట్రంలో ఫిబ్రవరి 12 నుండి 28 వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 28న ఇంద్ర పార్క్లో మహా ధర్నాతో ముగిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రం పాదయాత్రకు సంఘీ భావంగా ఈ నెల 20న జిల్లాలో 10కిలో మీటర్లు పాదయాత్ర ఉంటుందని ఆయన పిలుపు నిచ్చారు. ప్రభుత్వాలు కార్మికుల జీవన ఉపాధి కోల్పోయే విధంగా వ్యవహరి స్తున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 28న హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర పెద్ద ఎత్తున జరిగే మహాధర్నాకు పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని ఆయన అన్నారు. కనీసం నెలకు రూ.26000 నిర్ణయించాలని, జీవో నెం 60 ప్రకారం పారిశుధ్య కార్మికులకు రూ.15,600 ఇవ్వాలని ఆయన అన్నారు. కారో బార్, బిల్ కలెక్టర్లకు రూ.19500 ఇవ్వాలని, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22500 వేతనాలు చెల్లించాలని ఆయన అన్నారు. యాక్ట్ 2/94ను రద్దుచేసి పంచాయతీ సిబ్బంది నందరిని పర్మినెంట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పీయఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని ఆయన అన్నారు. పంచాయతీ కార్మికులకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థికంగా సాయం చేయాలని ఆయన అన్నారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరపతయ్య, యాకోబ్ సురేష్, రోశమ్మ వెంకటమ్మ, నాయుడు, ఏడుకొండలు పాల్గొన్నారు.