Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్లుజేఎఫ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణకు వినతి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని కోరుతూ తెలంగాణ ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు టీడబ్లుజేఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆదివారం ఆయన భద్రాచలం పట్టణంలోని వీరభద్ర పంక్షన్ హాలులో ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్టు అరుణ్‌సాగర్ పేరిట నిర్వహించే పురస్కారాల కార్యక్రమానికి వచ్చిన ఆయనకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. రెండవ విడత అక్రిడిటేషన్ కార్డులను నేటికీ జారీ చేయలేదన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులతో పాటు, ప్రైవేటు పాఠశాలలో 100 శాతం ఉచిత విద్యను అందించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫేడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి, జిల్లా అద్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, రాష్ట్ర నామయకులు డి. రవికుమార్, కమిటీ సభ్యులు పుష్పగిరి, కౌశిక్, జీవన్ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.