Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవన యానంకు ఇదే పునాది
- ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్థి జీవితంలో ఆట-పాటలతో పాటు చదువు అత్యంత కీలకమైనది అని, చదివిన పాఠశాల నేల వంటిది అయితే ఇక్కడే మీ భవిష్యత్ జీవితానికి పునాది పడుతుందని, మీ జీవిత ప్రయాణంలో భాగమైన పాఠశాల జీవన ప్రయాణం ముగియడం బాధాకరం అయినప్పటికీ తప్పని పరిస్థితి అని శ్రీ గౌతమి స్కూల్ ప్రధానోపాద్యాయురాలు లక్ష్మి అన్నారు. స్థానిక శ్రీ గౌతమి స్కూల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు ఆటపాటలు, భావోద్వేగాల నడమ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి చదివారని, ఉపాద్యాయులు చెప్పింది శ్రద్ధగా విని ఇప్పటి వరకు రాసిన ప్రతి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నారని, అదేవిధంగా తుది పరీక్షలకు కూడా సిద్ధం కావాలి అని అన్నారు. వీడ్కోలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సందర్భంలో ఉంటుందని, మీరు వెళ్తున్నందుకు ఒకింత బాధ అయినా ఉన్నత చదువులకు వెళుతున్నారని సంతోషంగా ఉంది అని హర్షం వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు బాగా రాస్తారు అని ఆశిస్తున్నాను అని తెలియజేశారు. కరస్పాండెంట్ చలపతిరావు మాట్లాడుతూ వీడ్కోలు పలకడం అంత సులువైన విషయం కాదు అని కానీ పదో తరగతి పూర్తి చేసుకుంటున్న మీకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. అల్లరి, సరదా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఈ గౌతమి స్కూల్లో నేర్చుకున్న విద్యాబుద్ధులు మీ పై స్థాయి చదువుల్లో ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఒక్కరూ మా జీవితాలను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు ప్రయత్నించే వారిని మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాము మేము ఏ స్థాయికి వెళ్లిన మీరు మా గుండెల్లో ఉంటారు అని భావిద్వేగాలతో తెలియజేశారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ మీరంతా మంచిగా చదువుకొని ఈ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కన్నారావు, వెంకట్, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి , రాము, కృష్ణవేణి ,వాసవి, శైలజ తదితరులు పాల్గొన్నారు.