Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గుమ్మడి గాంధీ
నవతెలంగాణ-పినపాక
ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆదివారం పినపాక మండలం గోపాలరావు పేట గ్రామంలో జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎంపీపీ, సీఐ రాజగోపాల్, ప్రముఖ సింగర్ కళాకారులు సిద్దేల హుస్సేన్ కలిసి ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాత్రికేయులకు, పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాల్ రావ్ పేట గ్రామంలో జరుగుతున్న క్రీడా పోటీలను పినపాక ఎంపీటీసీ సత్యం, సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, మెడికల్ ఆఫీసర్ దుర్గా భవాని హాజరై మ్యాచ్‌ను వీక్షించారు. మూడు రోజులపాటు టోర్నమెంట్ కొనసాగుతుందని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు భరత్, అధ్యక్షులు బిల్లా నాగేందర్ తెలియజేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మ్యాచ్‌లను వీక్షించడానికి మండలంలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం ప్రెస్ క్లబ్ విజయాన్ని సాధించింది. మాన్ అఫ్ ద మ్యాచ్‌గా రంజిత్ కుమార్ నిలిచారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగేంద్ర చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందించారు. అనంతరం క్రీడాకారులకు మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని సైతం మధ్యాహ్నం కల్పించారు. మ్యాచ్ జరిగే సమయంలో సహకరించిన పినపాక ఆరోగ్య సిబ్బందికి, ఆశాలకు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు మహేష్, సుధాకర్ బోడ లక్ష్మణ్, కోటి, దిలీప్, తదితర పాత్రికేయ మిత్రులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.