Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి సంస్థలో నూతనంగా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ (ఆపరేషస్స్) ఎన్.వి.కే.శ్రీనివాస్, డైరెక్టర్ (పి.పి) జి.వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం ఇల్లందు ఏరియాలో పర్యటించారు. ముందుగా వీరిని ఏరియాలోని జీఎం కార్యాలయంలో పుష్పగుచ్చం శాలువాతో ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు సన్మానించారు. తదుపరి వారు ఏరియాలోని విభాగాల అధిపతులతో ఉత్పత్తి సాధనపై సమీక్ష సమావేశం నిర్వహించి నూతన జే.కే ఉపరితల గని ఏర్పాటుకై అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. తరువాత ఏరియాలోని జెకె ఉపతల గని వ్యూ పాయింట్ నుండి గనిలోని పని ప్రదేశాలను సందర్శించి అధికారులకు తగు సలహాలు సూచనలు చేశారు. నూతనంగా సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బుగ్గవాగు వంతెనను సందర్శించారు. తదుపరి జీఎం కార్యాలయంలో జే.కే.అండ్ కోయగూడెం ఉపరితల గని అధికారులతో జీఎం సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి శ్రీనివాసు, ఏజీఎం(ఐఈ) గిరిధరరావు, డీజీఎం (పర్సనల్) జి.వి మోహన్ రావు, డిజీఎం (వర్క్ షాప్) శేఖర్ బాబు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.