Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని, బావోజీ తండాలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. గెలుపొందిని విజేతలకు బహుమతులు అందజేశారు. బావోజితండా రేగళ్లలో రెండు రోజులుగా జరిగిన డాక్టర్ బిఎస్.రావు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ హౌరాహౌరీగా ముగిసాయి. పట్టణ ప్రముఖ ఇఎంటీ వైద్యు నిపుణులు డాక్టర్ బిఎస్.రావు గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు. పెద్దతండా జట్టు, మైలారం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగాయి, మొదట బ్యాటింగ్ చేసిన మైలారం జట్టు నిర్ణిత 8 ఓవర్లలో 54 పరుగులు సాధించారు. 55 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పెద్దతండా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయ లక్ష్యం చేదించారు. మ్యాన్ ఆఫ్ ధ సిరీస్ హనుమ, మ్యాన్ ఆఫ్ మ్యాచ్, బెస్ట్ బౌలర్గా జి.అశోక్ ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమంలో బావోజితండా సర్పంచ్ వంకుడొత్ రత్ని, ఎల్. పూర్ణ, యువకులు సురేష్, హనుమ, ప్రసాద్, అశోక్, శ్రీహరి, గణేష్ పాల్గొన్నారు.