Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాక బ్రిలియంట్ జూనియర్ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి.ఎన్.ఆర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో బ్రిలియంట్ కాలేజ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వారు అన్నారు. ఈ కాలేజ్లో చదవడం మా భవిష్యత్తుకు ఒక అద్భుత అవకాశం అని వారు చెప్పారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు అందరూ మీరనుకున్న లక్ష్యాలతో జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పారు. అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి.ఎన్.ఆర్ మాట్లాడుతూ ఈ రోజు ఇంటర్ కాలేజ్ స్థాయికి ఎదిగామని, తమ దగ్గర నుంచి వెళ్లే ప్రతి విద్యార్థి క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. తమ తల్లి దండ్రులు గర్వపడేలా మీ ఊరికి కూడా మంచి పేరు తేవాలని ఆయన కోరారు. విద్యార్థి అనుకుంటే సాధిం చలేనిది ఏదిలేదని, ప్రపంచంలో మీరందరూ ఉన్నత స్ధాయికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందం, బ్రిలియంట్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.