Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
సీతారామ ప్రాజెక్టు కాలువల కింద భూములు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కామేపల్లి, ఏన్కూర్, గార్ల, డోర్నకల్ మండలాల్లో సీతారాం ప్రాజెక్టు కాలువల కింద భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఈనెల 13న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నష్టపరిహారం ఇవ్వకపోగా రైతుబంధు కూడా నిలిపివేయడం జరిగిందన్నారు. రైతులు రెండు సంవత్సరాల నుండి కాలువలు వస్తున్నాయనే పేరుతోనే పంటలు వెయ్యలేదు దీనివల్ల రైతులకు అనేక నష్టపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి బాలాజీ, అర్జ రంగయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.