Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మధిర
మధిర తేళ్ల వసంతయ్య స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పూర్వ విద్యార్థి సంఘం 45వ సమ్మేళనం ఆత్మీయ వాతావరణంలో నిర్వహిం చారు. ముందుగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మాధవరపు నాగేశ్వరరావు, కార్యనిర్వాహక బాధ్యులు అవ్వ వెంకట రమణ రావు, మధిర బాబులా, పుల్లకండం చంద్రశేఖర్, మండవ వాసు, మక్కెన నాగేశ్వరరావు, చెరుపల్లి శ్రీధర్, మొదలగువారు తేల వసంతయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉన్నత స్థాయికి ఎదిగిన పాఠశాల పూర్వ విద్యార్థులకు కమల్ రాజు చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం 1984-85, 1985-86, 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ ల పూర్వ విద్యార్థులకు సన్మానం జరిగింది. వివిధ అంశాలలో మెరిట్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు పథకాలు, నగదు బహుమతులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, అమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ నందినిల చేతుల మీదుగా అందించారు.