Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పినపాక అభివృద్ధికి పునాదులు వేద్దాం
- రేగా కమీషన్ల కాంతారావు
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పోదెం
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో దోపిడీ పాలనను సమాధి కడతామని నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పోదేం వీరయ్య అన్నారు. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మణుగూరులో ప్రవేశించింది. ఈ సందర్భంగా తోగూడెంలో పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పై చార్జ్ సీట్ విడుదల చేశారు. నమ్మిన ప్రజలను వంచించి తన, స్వ ప్రయోజనాల కోసం డబ్బు పై ఆశ చావక తనను తన అమ్మకానికి పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రేగా అడ్డంగా బుక్ అయ్యారన్నారు. నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు కూడపెట్టారని విమర్శించారు. చార్జిసీట్లో తప్పని నిరూపించేందుకు అంబేద్కర్ సెంటర్కి రావాలని రేగాకు సవాల్ విసిరారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. నేడు భద్రాచలం జరిగే యాత్రలో రాష్ట్ర సీనియర్ నాయకత్వం అంత పాల్గొంటారని ఎలాంటి భేదాభిప్రా యాలు లేవన్నారు. వివిధ భేదాభిప్రాయాలు నుండి ఏకాభిప్రాయంతోనే కాంగ్రెస్ ముందు నడుస్తుందన్నారు. పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రి కోరిక బలరాం నాయక్, మల్లు రవి, రాజన్న, చందా లింగయ్య దొర, ఓరుగంటి భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.