Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయాలి
- ఏరియా జీఎంలకు సింగరేణి డైరెక్టర్ల ఆదేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, ఇందుకోసం ఏరియా జీఎంలు ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని సంస్థ డైరెక్టర్లు ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్, ఈ అండ్ ఎం డైరెక్టర్ డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె.శ్రీనివాస్, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిఎంలతో కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 47 రోజుల్లో ప్రతీ నిమిషం అత్యంత కీలకమని, ప్రతీ షిఫ్టు వారీగా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించడం ద్వారా ఈ ఏడాది సింగరేణి చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు, టర్నోవర్‌ను సాధించవచ్చన్నారు. రోజుకు 2.30 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.అల్విన్, జీఎం కో-ఆర్డినేషన్ ఎం.సురేశ్, భూపాలపల్లి నుంచి అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, జీఎం సీపీపీ సీహెచ్.నరసింహారావు, కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.