Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు
- వరి పంటలపై ఆశించు చీడపీడల నివారణ సలహాలు పాటించండి
నవతెలంగాణ-పాల్వంచ
స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా సంబంధిత మండల వ్యవసాయ అధికారి రైతులకు ఇస్తున్న పలు సలహాలు సూచనలు పాటించి లాభసాటి వ్యవసాయం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు రైతులకు సూచించారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ వరి పంటలపై ఆశించి చీడ పీడల నివారణ గురించి సలహాలు సూచనలు చేశారు. జిల్లాలో వరి పంట దుబ్బు చేరే దశ నుండి చిరు పొట్ట దశలో ఉన్నాయని, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైలల్లో మోగి పురుగు, చెవుడు నాచు, సల్పేడు దాతు, విష ప్రభావం, జింక్ లోపం ఇతర రకాల చీడపీడల ఆశించడం వలన పంట నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం ఈ సూచనలు చేస్తున్నామని చెప్పారు. నాచు నివారణకు అధిగమించడానికి వరి కులాన్ని చేతులతో ఎలియాబెట్టాలి, అలాగే పొలాన్ని అడపాదడపా అరికట్టాలి, నాచు కట్టడం వలన ఎదుగుదల లేకపోవడంతో రైతులపై పాటుగా యూరియాను వేయరాదని చెప్పారు. వివిధ రకాల గుళికలు వాడకూడదని అన్నారు. పొలంలో చెవుడు జంకు లోపం వంటి సమస్యలను నివారించడానికి పొలంలో నీరు పెట్టిన తర్వాత బయటకు తీసివేయాలి, వరి పైరు ఎదుగుదలకు భూ విలాలలో ఉన్న సిలింద్రాలను నివారించడానికి కలుపు తీసిన తర్వాత ఒక ఎకరానికి 25 నుండి 30 కిలోల యూరియా కార్పండి జామ్ 25శాతం మ్యాన్కో జెబ్ 50శాతం పొడి మందును కలిపి బురద పదంలో చల్లాలిని చెప్పారు. జింకు లోపం గమనించినట్లయితే జింకు సల్ఫేట్ 21-33శాతం పై రెండు గ్రాములు లీటర్ నీటిని కలిపి వారంలో రెండు సార్లు పిచికారి చేయాలి, వరిలో కాండం తొలిచే పురుగు రెండు దశల్లో ఆశిస్తుందని ప్రస్తుతం ఈ పురుగు ఉధృతి పిలక దశలో ఉంది అని వరి పంట నాటిన 15 డ్యాష్ 40 రోజుల దశలో కార్బోఫ్యు రన్ 3జి గుళికలపై 10 కేజీలు లేదా కార్పఫ్ హైడ్రో క్లోరైడ్ నాలుగు జిగుళికలు లేదా క్లో రాంత్ర నెల్లిప్రోలు 0.4 జి నాలుగు కేజీలు చొప్పున 25 కిలోల పొడి ఇసుక కలిపి బురద పదునులో వేయాలి, రానున్న మార్చి మాసంలో అగ్గి తెగులు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికి ముందుగా నాటిన వరి పొలంలో ఈ సమస్యను గుర్తించడం జరిగిందని చెప్పారు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి పలు సూచనలు సలహాలు పాటించి లాభసాటి వ్యవసాయం చేసుకోవాలని ఆయనే రైతులందరికీ సూచించారు.