Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీిఎఫ్ పద్ధతి మార్చుకోవాలంటున్న ఆదివాసీలు
నవతెలంగాణ-చర్ల
కరోనా కారణంగా ముక్కుతు... మూలుగుతూ.. మూలిగేనక్క మీద తాటిపండు పడ్డ చందంగా గిరి జన విద్య సాగుతూ ఉంటే భద్రాచలం ఐటీడీఏ పరి ధిలో గల కొన్ని పాఠశాలకు వారం మొత్తానికి కేవలం మూడు రోజులు పని దినాలు కావాలంటూ టీపీట ీఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం ఐటీడీఏ పీఓను కోరడం దురదృష్టకరమని ఆదివాసీలు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో కొంతమంది ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు తమ తమ విధు లకు హాజరవుతుండగా, కొంతమంది మెడికల్ లీవు లు, ఆన్ డ్యూటీలో ఉన్నత చదువులకు వెళ్లి ముక్కుప చలారని ఆదివాసి చిన్నారుల భవితవ్యాన్ని కాలరాస్తు న్నారని ఆరోపణలు ఘాటుగా వినపడుతున్నాయి.
ఆందోళన చేస్తున్న గిరిజనులు
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న గిరిజన విద్యార్థుల చదువులపై ఐటీడీఐ అధికారులు సీత కన్ను వేస్తున్నారని పలువురు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అక్షర జ్ఞానం లేక అడవులమ్మటి చిన్నారులు తిరుగుతూ ఉంటే లక్షల రూపాయల జీతాలు తీసుకునే కొంతమంది ఉపాధ్యాయులు తమతమ వృత్తి ధర్మం పాటించకుండా టీపీటీఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం కూడగట్టుకొని వారం మొత్తానికి మూడు రోజులు మాత్రమే మేము విధులు నిర్వహిస్తామని భద్రాచలం ఐటీడీఏలో దరఖాస్తు చేసుకోవడం విద్యావ్యవస్థను ఎటువైపుకు తీసుకెళుతున్నారో ఆలోచించవచ్చు. మండల పరిధిలోని, ఉంజుపల్లి వద్దిపేట, పూసుగుప్ప, పులిగుండాల, చెన్నాపురం వంటి ఆదివాసి గ్రామాలకు విశాలమైన చక్కటి బీటీ రోడ్లు ఉండగా ఆయా గ్రామాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు సైతం మూడు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. మిగతా మూడు, రోజులు సెలవు కావాలంటూ దరఖాస్తు చేయడం కడు చోచనియమని ఒకపక్క ఆదివాసి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు సైతం పెదవిరుస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు మావోయిస్టులో బూచి చూపించి ఇన్నాళ్లు అరణ్య గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లకుండా బడి డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల ద్వారా బడి ఎగ కొట్టడానికి మూడు రోజులు పని దినాలు కావాలంటూ ఉపాధ్యాయ సంఘాల ద్వారా వినతి పత్రాలు అందించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు విరుచుకుపడుతున్నారు.
టీపీటీఎఫ్ పద్ధతి మార్చుకోవాలంటున్న ఆదివాసీలు
గిరిజన విద్యాభివృద్ధి కోసం నిత్యం పాటుపడాల్సిన ఉపాధ్యాయ సంఘాల పనితీరు మాని మూడు రోజుల పని దినం కోరుతున్న టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం పనితీరు వెంటనే మార్చుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ రూల్స్, ఉపాధ్యాయ ఇతర సమస్యలను పరిష్కరించాల్సిన ఉపాధ్యాయ సంఘాలు మా ఉపాధ్యాయులు మూడు రోజులే పని చేస్తారని దరఖాస్తు చేయడం ఎంతవరకు సక్రమమైన పని అని పద్ధతి మార్చుకోకపోతే ఆదివాసీ లంతా కలసి ఉద్యమిస్తామని ఆదివాసులు హెచ్చరిస్తున్నారు.
నిరంతరం విధులు నిర్వహించని ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టాలి
నిరంతరం పాఠశాలలకు వెళ్లి గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించకుండా రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు చేపట్టాలి. విద్యార్థి దశను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాలను సైతం కఠినంగా శిక్షించాలి. ఐటీడీఏ పీవో దృష్టిసా రించి చర్యలు చేపట్టకపోతే మూడు రోజుల పని విధానంపై డివిజన్ వ్యాప్త ఉద్యమాలు చేపడతాం.
పాయం సత్యనారాయణ జీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు