Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండవల దఫ కంటి వెలుగు కార్యక్రమంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపాలిటీ 23వ వార్డు కూలీ లైన్లో కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ప్రజల అవసరాన్ని ముందుగానే గుర్తించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, అందులోభాగంగా రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. కంటి పరీక్షలు చేపించుకున్న వారికి మందులు, కళ్లజోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జెవిఎల్. శిరీష, మున్సిపల్ వార్డు వై.శ్రీనివాస్ రెడ్డి, కంటి పరీక్ష డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ రెవిన్యూ అధికారులు, ఆర్పి, ఓబిలు, అంగన్వాడి టీచర్లు, పాల్గొన్నారు.
10వ తరగతి విద్యార్థులకు
జీఎస్ఆర్ ట్రస్టు కిట్స్ పంపిణీ
కొత్తగూడెం డాక్టర్ జిఎస్ఆర్ చార్టబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్లను అందజేశారు. హేమచంద్రపురం, చుంచుపల్లి జెడ్పీ ఎస్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 160 మంది విద్యార్థులకు పరీక్ష కిట్లను, పరీక్షా పాడ్స్‌ను ట్రస్ట్ చైర్మన్ ఆదేశాల మేరకు పంపిణీ చేసి, టెన్త్ పరీక్షలకు సిద్దం అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కె.కృష్ణారావు, ఎస్.రమేష్, మోదుగు జోగారావు, కేశవపట్నం. శ్రీనివాసరావు, ఎన్.శ్రీనివాసరావు, సామాజిక వేత్త కడవెండి వేణుగోపాల్, పాపారావు, పాఠశాల హెడ్ మాస్టర్స్ లీలా, వసంత లక్ష్మీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.