Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-దమ్మపేట
ఎంతో చరిత్ర గల దమ్మపేట సంతాన వేణుగోపాల స్వామి ఆలయ భూములను ఆక్రమించుకొని దశాబ్దాలుగా ఆ సొమ్ము తింటున్న పెద్ద మనుషులు మర్యాదగా ఆ భూములను దమ్మపేట గ్రామంలోని పెద్ద మనుషులతో చర్చించి సంతాన వేణుగోపాల స్వామి దేవాలయానికి ఇవ్వాలని అశ్వరావుపేట శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం దమ్మపేటలో శివాలయ ఆలయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ దమ్మపేటలోని ఈ రెండు దేవాలయాలు రెండు కళ్ళ వంటివని, అలాంటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములను కొంతమంది ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని, ఈ పద్ధతి మంచిది కాదని తాను కలెక్టర్‌తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ దేవాలయ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ ఫలాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు ఒక అవకాశం ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో దమ్మపేట పెద్దమనుషులు కలుగజేసుకొని దేవాలయ భూములను దేవాలయానికి అప్పగించాలని, లేనిపక్షంలో తాను ఏం చేస్తాను ఇప్పుడు తెలియజేయడని అన్నారు. దమ్మపేట శివాలయం అభివృద్ధి కోసం రూ.50 లక్షలు, దమ్మపేట సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.20 లక్షల ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయటానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మెన్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులతో ఎండోమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తులురి వెంకట్రామారావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జున్‌రావు, ఉప సర్పంచ్ యుగంధర్, రాజేశ్వరరావు, పశువైద్యాధికారి మన్యం రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.