Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సుదూర మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల నుంచి ఎంతో నమ్మకంతో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెట్టే స్వయం ఉపాధి పథకాలను లబ్ధి పొంది జీవనోపాధి పెంపొందించుకోవడానికి గిరిజన దర్బార్‌కు గిరిజనులు అర్జీలు సమర్పించుకున్నారని, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధికారిక పనులపై వెళ్లినందున, గిరిజన దర్బార్‌కు అర్జీలు ఇవ్వడానికి వచ్చిన గిరిజనుల నుండి ఐటీడీఏ పరిపాలన అధికారి భీముతో కలిసి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుచు అర్హులైన ప్రతి గిరిజనులకు ఐటీడీఏ ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజన గురుకుల పాఠశాలలో సీట్ల కొరకు ఎవరూ అర్జీలు సమర్పించవద్దని, గురుకుల పాఠశాలలో సీట్లన్నీ భర్తీ అయినవని, గిరిజనులు ఈ విషయాన్ని గమనించి సీట్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవద్దని అన్నారు. ప్రస్తుతం పోడు భూములకు సంబంధించిన పట్టాల కోసం పనులు వేగవంతంగా అధికారులు కృషి చేస్తున్నందున, వాటికి సంబంధించిన దరఖాస్తులను కూడా గిరిజన దర్బార్‌లో సమర్పించకూడదని అన్నారు. గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులను ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా సమస్యలు పరిష్కరించి, సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్ బాబు, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, ఏపీవో (పవర్) మునీర్ పాషా, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారా యణ, జేడీఎం హరికృష్ణ, హెచ్ఈఓ దుర్గయ్య, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పర్యవేక్షకురాలు ప్రమీల బారు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ విభాగం నాగభూషణం, ఐటీడీఏ భాగంలోని వెంకటేశ్వర్లు, ప్రేమ్ దాస్, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.