Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదాని స్టాక్స్ కుంభకోణపై మోడీ భాద్యత వహించాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సాబీర్ పాషా
- సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్బీఐ ఎదుట ధర్నా...నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రధాని మోడీ దేశంలోని ఆర్ధిక నేరాగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడని, కోట్లాడి రూపా యలు దేశ సంపదను, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నా మోడీ నోరు మెదకపకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. ఆదాని స్టాక్స్ కుంభకోణంలో ఆదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం ఎస్బిఐ బ్యాంకు ప్రధాన ద్వారాన్ని మూసివేసి ధర్నా చేపట్టారు. తొలుత ప్రధాన సెంటర్ల మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ హిడెన్బర్గ్గ్ నివేదికతో ఆదాని అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయని, మోడీ సహకారంతో ఆదానీ దేశసంపదను దోచుకొని ప్రపంచ కుభేరుల్లో మూడో వ్యక్తిగా స్థానం దక్కించుకున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, భూక్య శ్రీనివాస్, కె.రత్నకుమారి, పార్టీ ప్రజా సంఘాల నాయకులు గడ్డం రాజయ్య, బోయిన విజరు కుమార్, రాంబాబు, షాహెన్, రాంజి, విజయలక్ష్మి, జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిట వేసి విచారణ చేయాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు శివకృష్ణ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి, మాట్లాడారు..ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, బత్తుల సాయి, వెంకటేష్, నల్ల ప్రసాద్, పదం విజయలక్ష్మి, శాంతి, జాన్ బి, కృష్ణవేణి, నక్క నాగమణి తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : దేశంలో ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా సంపాదించిన అదానీ ఆస్తుల్ని వెంటనే జప్తు చేసి ఆదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్వంచ కార్యాలయం వద్ద సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పూర్ణచంద్రరావు మాట్లాడారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బండి నాగేశ్వరరావు, జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి పద్మజ, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : సీపీఐ చలో ఎస్బీఐ బ్యాంక్ ధర్నా పిలుపులో భాగంగా సోమవారం పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ సలీం నేతృత్వం స్థానిక బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, ఏఐటీయూసీ నాయకులు టి.సత్యనారా యణ, నాగేంద్రబాబు, సజ్జ శ్రీను, పాల్గొన్నారు.