Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ పాల్వంచ
పాల్వంచ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నూతనంగా ఏర్పడ్డ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ నిర్వహించారు. 6వ వార్డులో పర్యటించి వార్డు పరిధిలో గల సమస్యలు తెలుసుకొని ప్రజల అభిప్రాయం తెలుసుకొని సంతకాల సేకరణ చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ పాల్వంచ పట్టణ స్థానిక ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. అలానే వార్డు పరిధిలో గల సమస్యలు ఎన్నిసార్లు కమిషనర్‌కు చెప్పిన పట్టించుకోవట్లేదని జేఏసీ నాయకులకు విన్నవించుకొని వాపోయారు. కావున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలు స్వచ్ఛందంగా కోరుతూ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ ఎన్నికల జేఏసీ నాయకులు మాట్లాడుతూ... తక్షణమే పాల్వంచ పట్టణ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వార్డులు విభజన చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సయ్యద్ రషీద్, వర్తక సంఘం అధ్యక్షులు జేఏసీ సలహాదారు చలవాది ప్రకాష్, కో కన్వీనర్ ఆరుద్ర సత్యనారాయణ, కోఆర్డినేటర్ బాడిశ బిక్షం, ప్రచార కార్యదర్శి యువతరం పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, పాల్వంచ పట్టణ టీడీపీ సెక్రెటరీ రెహమాన్ క్లీన్అండ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షులు బట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.