Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలు సకాలంలో చెల్లించి రాయితీలను రైతులు పొందాలి
- డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం
నవతెలంగాణ-చండ్రుగొండ
సొసైటీల ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.1600 కోట్లు రుణాలు అందజేయడం జరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. సోమవారం స్థానిక డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ రావడం జరుగుతుందన్నారు. తద్వారా వడ్డీ భారం తగ్గుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో సైతం రైతుల పిల్లలకు విదేశీ చదువుల కోసం రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 10 లక్షల నుండి 35 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుందన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రూ 90 వేల వరకు రుణమాఫీ ప్రభుత్వం ఇవ్వటానికి నిర్ణయించినట్లైతే డీసీసీబీ ద్వారా 300 కోట్లు వరకు రైతులు రుణాలు మాఫీ అవుతుందన్నారు.
సారేపల్లి నాగ శిరోమణికి ఘన నివాళి
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్ సతీమణి సారేపల్లి నాగ శిరోమణి (54)కు డీసీసీబీ చైర్మన్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించాడు. ఆయన వెంట ఎంపీపీ పార్వతి వైసీపీ నాయకులు సత్యనారాయణ, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ చైర్మన్ బోయిన్పల్లి సుధాకర్ రావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లింగయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జడ వెంకయ్య, సత్తి నాగేశ్వరరావు, కృష్ణయ్య, భారత రాంబాబు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.