Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల ప్రజలందరూ ఉచిత కంటి వెలుగు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ కనకం తనూజ సూచించారు. మండల కేంద్రములోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని విశేష స్పందన లభించిందన్నారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని కంటి వెలుగు కేంద్రాన్ని చండ్రుగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలోకి మార్చడం జరిగిందన్నారు. ఈ శిబిరం (మంగళవారం) 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు రఘు నంద సాయిబాబు,హెల్త్ సూపర్ వైజర్ ఇమామ్, శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కే.ఉపేందర్, కంటి వెలుగు టీమ్ సభ్యులు, ఏఎన్ఎం రాధా, ఆశాలు రుక్మిణి, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.