Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు పంచుతా..
- రేవంత్ రెడ్డి పగటి కలలు కంటుండు
- మోకాళ్ళ యాత్రలు చేసిన నా విజయం ఆపలేరు
- టీపీసీసీ ఛీప్ వ్యాఖ్యలపై రేగా ఫైర్
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఆస్తులపై ఎంక్వయిరీ పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, 300 ఎకరాలు ఆక్రమించినట్లు నిరూపిస్తే తక్షణమే పేద ప్రజలకు పంపిణీ చేస్తాననని సోషల్ మీడియా వేదికగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటుగా విమర్శించారు. మంగళవారం తన అధికారిక వాట్సాప్ గ్రూప్లో ప్రకటన విడుదల చేశారు. నీ ఆస్తులు కూడా ఎంక్వయిరీ చేసి ప్రజలకు పంచుతావా అని ప్రశ్నించారు. నాపై చార్జ్ షీట్ విడుదల చేసే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు తిరిగి జవాబు చెప్పారు. బెదిరింపులకు పాల్పడితే బెదిరిపోయే వారు ఎవరూ లేరని సవాల్ విసిరారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు, వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి అడ్రస్ గల్లంతవుతుందన్నారు. ఓటుకు నోటు దొంగవి నువ్వు, నాకు నీతులు చెబితే నేర్చుకునే అంత తెలివి లేని వాన్ని కాదు, నువ్వు దందాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందన్నారు. నువ్వే కాంగ్రెస్కు పట్టిన చీడపురుగు అన్నారు. నిన్ను గాంధీభవన్ నుండి గుడ్డలు ఊడదీసి, తన్ని బొంద పెడతారని హాట్ గా కామెంట్ చేశారు. సంస్కారం లేని వాడివి నోరు జారి మాట్లాడితే నాలుక కోస్తా బిడ్డ అని హెచ్చరించారు. జోడో యాత్రలు కాదు కదా మోకాళ్ళ యాత్ర చేసిన గెలిచేది నేనే నా విజయం ముందు మళ్లీ వచ్చి అదే అంబేద్కర్ సెంటర్లో నిన్ను తిట్టినానని తప్పు చేశానని మోకరిల్లాల్సిందే, ఇలాంటి హాట్ టాపిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనే ఓట్లు అడగమనే సన్యాసి రేవంత్ రెడ్డి మరి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఉచిత కరెంటు పింఛన్లు ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలు తీసుకునే ప్రజలను కూడా ఓట్లు అడగవుగా అని ప్రశ్నించారు. నిన్నూ, నీ పార్టీని గోదాట్ల ముంచేదాకా నిష్క్రమించేది లేదన్నారు.