Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- జాతరలో ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు, బాణా సంచా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి 22వ జాతర మహౌత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఆఖరి రోజు వేలాది మంది భక్తులతో దుమ్ముగూడెం గ్రామం మొత్తం జన సంద్రంలా మారింది. సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అమ్మవారిని దర్శించుకుని మొక్కు బడులు చెల్లించుకున్నారు. మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఉదయం అమ్మవారి ఆలయాన్ని శుద్ది చేసి వెంకటాపురం వాస్తవ్యులు బాచినేని రాజేశ్వరి వారి కుమారుడు ప్రవీణ్ కుమార్ సుష్మలు అందజేసిన పట్టు చీరతో అమ్మవారికి అలంకరణ, అభిషేకములు, పుష్పాలంకరణ కుంకుమపూజా వంటి విశేష పూజలు అఖండ దూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు, దాతలు అందజేసిన విరాళాలలో సుమారు 50 వేల మందికి అన్నదానం అందజేశారుజ. అమ్మ వారి అఖరి ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు సాగింది. ఊరేగింపు సందర్బంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వారిచే డిజెతో సినీ కోయడాన్స్, కాళీమాతా, కింగ్‌కాంగ్, రాక్షసి బొమ్మలు వివిద వేషధారణలు, తూర్పుగోదావరి జిల్లా తుమ్మల వారిచే గిరిజన నృత్య ప్రదర్శన (కొమ్ము డాన్స్) కోలా టాలు, గరిగెలు, డప్పు వాయిద్యాలు, బాణా వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఆద్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ ఎస్సై లు రవికుమార్, కేశవ్‌లు పోలీస్, సిఆర్పిఎఫ్ బల గాలతో బందో బస్తు ఏర్పాట్లు ట్రాఫిక్ జామ్ కాకు ండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ మడి రాజేష్, కార్యదర్శి సందీప్‌లు పారిశుధ్య పనులు పర్యవేక్షించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.