Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వైద్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మైక్రోఫైలేరియా సర్వే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం ప్రారభించారు. జిల్లా కేంద్రంలోని టి-హబ్లో రక్త పూతల నమూనాల పరీక్షలు మొదలు పెట్టారు. జిల్లాలో 9 సెంటర్స్ల పరిధిలోని సుమారు 1లక్షా జనాభ పరిధి నుండి రక్త పరీక్షలు సేకరించారు. మొత్తం 5400 శాంపిల్స్ తీశారు. వీటిని పరీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టి హబ్ మేనేజర్ నిజాముద్దీన్, మలేరియా జిల్లా కో-ఆర్డినేటర్ కృష్ణ, సబ్యూనిట్ ఆఫీసర్ కె.కుమారస్వామి, లాబ్ టెక్సిషియన్స్ ఎబినైజర్, కోటేశ్వరరావు, శివ, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.