Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం దమ్మపేట సొసైటీ చైర్మెన్ రావు జోగేశ్వరరావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను మంగళవారం మంత్రి చాంబర్లో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా మండలంలో ఏర్పాటు చేయబోయే కోర్టుకు సంబంధించిన భవన పనులను పూర్తి చేయాలని, అదేవిధంగా మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, దీంతో పాటు మండల కేంద్రంలో బస్టాండ్‌ను ప్రయివేటు వ్యక్తులు ఆక్రమించుకొని ఇష్టా రీతిగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని దీనిపై దృష్టి సారించి బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీంతోపాటు పలు భూ సమస్యలకు సంబంధించిన విషయాలతో పాటు ఇటీవల మండలంలో వెలుగులోకి వస్తున్న భూ సమస్యలపై సైతం పరిష్కారం చూపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముష్టిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్, బత్తిన తిరుపతిరావు, వేపురి సురేష్, కేవీ సత్యనారాయణ, రవి, బండారుపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.