Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఏడవ దశ సీహెచ్పీ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో అనారోగ్య పాలైన ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళవారం సీహెచ్పీ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం నందు గతంలో అనారోగ్యంకు గురైన నలుగురు ఉద్యోగులకు ఒకొక్కరికి రూ.10000 చొప్పున రూ.40 వేలు కార్మికులకు అందజేస్తూ, ఈ మధ్యనే ఫైర్ అయి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుకుంటున్న ముగ్గురు ఉద్యోగులకు ఒకొక్కరికి రూ.25000 చొప్పున మొత్తం రూ.75000 వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు గుర్రం రాజ్ కుమార్ చేతులమీదుగా డీఈ చుండూరు శ్రీనివాస్ రావుకి అందజేశారు. మొత్తం వెల్ఫేర్ క్లబ్ ట్రస్ట్ ద్వారా రూ.115000 క్లబ్ మెంబర్స్, కమిటీ అందరి సభ్యుల సమక్షంలో అందించారు. ఈ సేవా సహాయ కార్యక్రమానికి అధ్యక్షులు గుర్రం రాజ్ కుమార్, కార్యదర్శి బిక్సపతి, ట్రెసరర్ బట్టు హరీష్, జాయింట్ సెక్రటరీ ఆవుల కృష్ణారెడ్డి, డీఈలు చుండ్రు శ్రీనివాసరావు, బలరాం రాంబాబు, హరిలాల్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భూక్యా రవి, అనిల్, ఏఈలు వినోద్, రామకృష్ణ, ఆర్థిసన్లు పాల్గొన్నారు.