Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-బూర్గంపాడు
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం పారిశ్రామిక ప్రాంతమైన సారపాక ప్రధాన కూడలి ప్రజలతో కిక్కిరిసింది. అశ్వాపురం మండలం నుంచి కాన్వారు ద్వారా సారపాకకు చేరుకున్న రేవంత్ రెడ్డి ఐటీసీ ఈస్ట్ గేటు సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాదయాత్రగా బయలు దేరిన రేవంత్ రెడ్డి తొలుత సారపాక కూడలీలోని మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ విగ్రహానికి, వైఎస్ఆర్, జాతిపిత గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సారపాక నుంచి గోదావరి వారధి మీదుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం తరలివెళ్లారు. రేవంత్‌రెడ్డి వెంట సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు, బట్టా విజయగాంధీ, ధనసరి సూర్య, మారం వెంకటేశ్వర్‌రెడ్డి, యారం పిచ్చిరెడ్డి, భజన సతీష్, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సారపాకలో మాట్లాడని రేవంత్ రెడ్డి
నిరాశ చెందిన పార్టీ శ్రేణులు
సారపాక పారిశ్రామి ప్రాంతంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడకపోవటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ గురయ్యారు. ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా పాదయాత్ర చేస్తూ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందారు.