Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ఖమ్మం, వరంగల్ పీఠాధిపతులు బాల్ రెడ్డి
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో ఉన్న ఆరోగ్య మాత దేవాలయం (చర్చి) వార్షిక ప్రతిష్ట మహౌత్సవ కార్యక్రమాన్ని చర్చి ఫాదర్ రేపెండర్ కిన్నెర రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం, వరంగల్ పీఠాధిపతులు విషబ్ ఉరుముల బాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్టాండ్ సెంటర్ నుంచి అయ్యన్నపాలెం ఆరోగ్య మాత చర్చి వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో పీఠాధిపతులను ఎక్కించి పలు సాంస్కృతి కార్యక్రమాలు డప్పు వాయిద్యాలు, కోలాటం, ఆదివాసి సంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ ర్యాలీగా చర్చి వద్దకు చేరుకున్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన గురు నిలయాన్ని పీఠాధిపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరోగ్య మాత చర్చి ఫాదర్ రేపెండర్ కిన్నెర రమేష్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా ఆలయ 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం, వరంగల్, జిల్లాల పీఠాధిపతులు ఉరుమల బాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పలువురు అభుస్యుత గురువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు, దేవాలయ బాధ్యుల సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి బూరుగూడెం, ఎర్రగుంట, మంగయ్య బంజర, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, గ్రామాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.