Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో డైరీ, క్యాలెండర్, స్టిక్కర్లను ఆవిష్కరించినట్టు ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి( జనరల్) ఇన్చార్జి ఆర్సిఓ (గురుకులం) డేవిడ్ రాజ్ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం తరుపున 2023 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రిషికేష్ కుమార్, రీజినల్ అధ్యక్షులు దేవదాస్, రాష్ట్ర మహిళా సంఘం ప్రతినిధి సునీత, ఇతర సంఘం సభ్యులు ఎస్.సరోజిని, బి సుజాత,పి.సునీత, ఈ.మమత ఏ.అనసూర్య, ఏ.రాంబాబు, గురుకులం సెల్ ఏవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.