Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
తండ్రికి తలకొరివి పెట్టిన విషాద ఘటన సత్తుపల్లిలో మంగళవారం జరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన బాలాజీ మిఠాయి దుకాణం యజమాని మచ్చ లక్ష్మణరావు కామెర్ల వ్యాధికి గురై ఏలూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతునికి కుమారులు లేకపోవడంతో ఆయన చిన్న కూతురు దివ్య తండ్రికి పట్టణ శివారులోని హిందూ శ్మశాన వాటికలో జరిగిన సంస్కారాల్లో తండ్రికి దివ్య తలకొరివి పెట్టింది. ఈ విషాద ఘటనను చూసి బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంత మయ్యారు. పట్టణంలోని పలువురు ప్రముఖులు లక్ష్మణరావు అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.