Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దె చెల్లించాలని నిరసన
- పరిశీలించిన డీఈవో
నవతెలంగాణ-మధిర
మధిర పట్టణంలోని నారాయణ స్కూల్ యజమాన్యానికి బిల్డింగ్ యజమానికి మధ్య వివాదం తలెత్తింది. అద్దె చెల్లించాలి అంటూ గేట్లకు తాళం వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులుఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న డీఈఓ సోమశేఖర్ మంగళవారం పాఠశాలను సందర్శించారు. బుధవారం నుండి స్కూల్ నడపవాలంటూ యాజమాన్యంకు ఆదేశాలు జారీ చేశారు. మధిరలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని స్కూళ్లపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఎంఈఓ వై.ప్రభాకరావును ఆదేశించారు. సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించిన డీఈవో సోమశేఖర్ శర్మకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలను తెలియజేశారు.