Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలాయపాలెం : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మౌలిక వసతులు తరగతి గదుల్లో అవసరమాగు సౌకర్యాల దృష్ట్యా ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల అభివృద్ధికి లక్షల రూపాయలు కేటాయించగా ఆ పనులను జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత పరిశీలించారు. మండల పరిధిలోని పిండిప్రోలు జల్లేపల్లి, పాతర్లపాడు, సుబ్లేడ్ గ్రామాల్లో ఆమె పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విద్యా కమిటీ చైర్మన్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, ఎంపీఓ రాజేశ్వరి, మన ఊరు మనబడి ఏఈ శ్రీకాంత్, విద్యా కమిటీ చైర్మన్ పరికపల్లి చంద్రశేఖర్ పప్పుల ప్రసాద్, హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.