Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ డైరెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక సిబ్బందికి పెండింగ్ జీతాలు ఇప్పించాలని కోరుతూ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ సూర్య శ్రీ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా పెండింగ్ జీతాలు రాక అప్పులతో కుటుంబాలను పోషించుకుంటున్నామని కార్మికులు వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శిరీష, మెటర్నిటీ చైల్డ్ ఆఫీసర్ చైతన్య, వంద పడకల ఆసుపత్రి సూపరిండెంట్ విజరు కుమార్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎండి గౌస్, ఐఎఫ్టియు అనుబంధ మణుగూరు ఏరియా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మిక సంఘం కార్యదర్శి యం.కేదారి, తదితరులు పాల్గొన్నారు.