Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలపాటి రాంమోహన్ రావు(రాము)
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా కల్పించే రాయితీలు కొబ్బరి రైతులకూ వర్తింపజేయాలని కొబ్బరి సాగుదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలపాటి రామ్మోహనరావు(రాము) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. స్థానిక ఎఫ్పీఓ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కొబ్బరి సాగుదారుల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు లక్ష్యంగా ఈ నెల 21న నారంవారిగూడెం సమీపంలోని కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం ప్రాంగణంలో నిర్వహించే సమావేశానికి జిల్లాలోని రైతులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి ఏపీ-తెలంగాణ కొబ్బరి అభివృద్ది బోర్డు అధికారులు, కొబ్బరి శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యాన అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. రైతుల సమస్యలు, రావల్సిన రాయితీలు పై అధికారులు సమావేశంలో వివరణ ఇవ్వనున్నారని అన్నారు. తెలంగాణలో నాలుగేళ్లుగా కొబ్బరి అభివృద్ధి బోర్డు నుంచి రావల్సిన రాయితీలను ఈ ప్రాంత రైతులు అందుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ శాఖ విజయవాడకు అనుబంధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కె.పుల్లయ్య, రైతు సంఘ నాయకులు తలసిల ప్రసాదు, నున్నా కృష్ణారావు, కొల్లు వెంకటరమణ, అల్లూరి బుజ్జి, శీమకుర్తి సాయిబాబా పాల్గొన్నారు.