Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలు రైతులకు రైతు బంధిస్తాం
- జోడో యాత్రలో రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, పత్తి పంటకు గిట్టదుబాటు ధర కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతుబంధు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హాత్ సే హాత్ జోడో అశ్వాపురం మండలంలో అమిర్దా, అమ్మగారి పెళ్లి తదితర గ్రామాలలో పాదయాత్ర కొనసాగింది. మార్గమధ్యంలో పత్తి, మిర్చి రైతుల వ్యవసాయ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. మహిళా కార్మికులతో కలిసి నాట్లు వేశారు. పొలం గట్లపై కూర్చుని వారు ముచ్చటించారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి రైతులకు నిరంధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు శాసన సభ్యురాలు సీతక్క, అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, గాదే కేశవరెడ్డి, వెంకటరమణ, రాఘవులు పాల్గొన్నారు.