Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు దశలుగా పరీక్షల నిర్వహణ
- జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలు ఏర్పాటు
- జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రాణి
నవతెలంగాణ-పాల్వంచ
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వాహనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలో నిర్మాణపై మంగళవారం ఆమె షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలు నిర్వాహనకు జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు దశలుగా జరుగు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు ఒకేషన్ కోర్స్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు 20363 మంది, ఒకేషనల్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1943, అలాగే సెకండ్ ఇయర్ చదువుతున్న జనరల్ విద్యార్థులు 5073 మంది మొత్తం 9379 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆమె చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మూడు దశలుగా నిర్వహించనున్న ఈ పరీక్షలు మొదటి దశ ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు, రెండవ దశ ఈనెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు, మొదటి దశ ఈ నెల 26వ తేదీ నుండి వచ్చేనెల రెండవ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతా యని ఆమె తెలిపారు. పార్టికల్ పరీక్షలు నిర్వహణకు జిల్లా స్థాయి ముగ్గురు అధికారులు, అలాగే రెండు ప్లేయింగ్ కార్డ్స్, 16 మంది డిపార్ట్మెం టల్ అధికారులు, 27 మంది చీఫ్ సూప ర్డెంట్లు విధులు కేటాయించినట్లు చెప్పారు. విద్యా ర్థులు ఏదేని సలహాలు సూచనల కోసం 79979 9436, 9490969965 ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ నెంబర్లులకు ఫోన్ చేసి సందేహా లను నివృత్తి చేసుకోవాలని ఆమె సూచించారు.