Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
క్షయవ్యాధికి వ్యతిరేకంగా మా పోరాటంలో రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు, పరిశ్రమలు, సంస్థలు, వ్యక్తులు పాల్గొని 2025 నాటికి టీబీని అంతం చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచన మేరకు మంగళవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కలిసి క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడాలని, టీబీని అంతం చేయాలని, నియోజకవర్గంలోని 181 మంది బ్యాలెన్స్ టీబీ రోగులను పౌష్టికాహారం కోసం దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ని-క్షరు మిత్ర వ్యక్తులు, ఎన్జిఓలు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు, సంస్థలు, ఎన్నికైన ప్రతినిధులు మొదలైనవి కావచ్చు, వారు టీబీ రోగులకు వారి పోషకాహార అవసరాలు, మందుల కోసం 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు మద్ద తు ఇవ్వాలని కోరారు. కావున, టీబీ రహిత తెలంగా ణను సాధించాలనే లక్ష్యంతో ని-క్షయ మిత్రగా నమోదు చేసుకొని ఆరోగ్య సంఘం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.
ఇక్కడ ఆసక్తిగల వ్యక్తు లు తమను తాము ని-క్షరు మిత్రగా నమోదు చేసు కోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నిక్షరు.ఇన్ తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పైడి వెంకటేశ్వర్లు జడ్పీటీసీ, డాక్టర్ మణిదీప్, ప్రసాద్ టిబి సూపర్వైజర్ పాల్గొన్నారు.
మెచ్చాని కలిసిన దమ్మపేట
(కొత్తపేట యువకులు)
దమ్మపేట మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీ యువకులు ఎమ్మెల్యే మెచ్చాని వారి నివాసమైన తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీధిలో ఉన్న పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. కొత్తపేట కాలనీలో డ్రైనేజీలు లేక వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వస్తుండంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీధిలో డ్రైనేజీలు నిర్మించాలని మెచ్చాకి వినతి అందజేశారు. స్పందిం చిన ఎమ్మెల్యే అదే సమయంలో అక్కడే ఉన్న పంచా యతీరాజ్ అధికారులను కొత్తపేట డ్రైన్స్ ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోపికృష్ణ, యార్లగడ్డ హరిబాబు, బొమ్మగాని చెన్నా రావు, ఎడవల్లి సాయి, కేత వెంకన్న, సిద్దు, దండి వేణు, తొంటెపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.