Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలోని జెకె 5 ఉపరితల గనిని, సోలార్ పవర్ ప్లాంట్ను మంగళవారం సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు జెకే ఉపరితల గనిని సందర్శించి అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలు అడిగి తెలుసుకుని, మాట్లాడారు. బొగ్గుకు పుట్టిన ఇల్లు అయినటువంటి ఇల్లందు ఏరియాలోని ఉపరితల గనిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని వాటిలో బొగ్గు ఒకటని, బొగ్గు ఉత్పత్తి గురించి సామజిక మాధ్యమాలలో మాత్రమే చూసానని, మొదటిసారి నేరుగా చూడడం చాలా సంతోషం కలిగించిందని, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. తదుపరి ఏరియాలోని 39 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను సందర్శించి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బోల్లం వెంకటేశ్వర్లు, డీజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, గని మేనేజర్ పి.పూర్ణ చందర్, ఆరెం వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేనేజర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి.శ్రీహరి ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.