Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎం రాంచందర్
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఉద్యోగంతో ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ డి.రాంచందర్ అన్నారు. బుధవారం మణుగూరు ఏరియాలో కారుణ్య నియామకం కింద మొత్తం నలుగురు డిపెండింట్లతో పాటు ఒక మహిళా డిపెండెంట్ కు సింగరేణిలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ డి రాంచందర్ మాట్లాడుతూ సింగరేణి వంటి సంస్థలో ఉద్యోగం దొరకడం గొప్ప అదృష్టం అన్నారు. సింగరేణి ఉద్యోగం ప్రత్యక్షంగా సంస్థ అభివృద్ధికి, పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి కూడా దోహదపడుతారన్నారు. కావునా నిబద్ధతగల ఉద్యోగిగా పేరు పొంది, ఉద్యోగ విరమణతో వచ్చే లక్షల రూపాయలకంటే తమ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అని భావించి మీకు ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతగా నాకాలు లేకుండా రక్షణ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.లలిత్ కుమార్, లక్ష్మీపతి గౌడ్, డిజిఎం పర్సనల్ సలగల రమేష్, శ్రీనివాస మూర్తి, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, సింగు శ్రీనివాస్, కాపా శివాజీ, ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.
సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ వెలుగులో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
సింగరేణి కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ (సిఎంఆర్) 2017 సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ వెలుగులో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మణుగూరు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జేవి రమణ అన్నారు. బుధవారం పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో పీకే ఓసి 2 ఆవరణలో జరిగిన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కార్మికులకు రక్షణ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గనిలో పని ప్రారంభించడానికి ముందు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, వుంటే దాని ఎలా నివారించాలి అనేది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అని అన్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించడం, దుర అలవాట్లకు దూరంగా ఉండటం, ట్రాఫిక్ రూల్స్ పాటించటం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్‌ను దూరంగా ఉంచటం, సీట్ బెల్ట్ ధరించడం, అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కలిగి ఉండటం, సరైన విశ్రాంతి, అనుక్షణం పనిలో అప్రమత్తత మొత్తంగా రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడటం ప్రమాద రహిత సింగరేణికై యాజమాన్యం చేపడుతున్న చర్యలలో భాగస్వాములు కావటం ఇదే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని అన్నారు. కార్మికులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాముడు, రక్షణ అధికారి జి.శంకర్, సీనియర్ పిఓ, ఎండి మదార్ సాహెబ్, అధికారులు భూక్య భాంగ్యా, నాగేంద్ర, బి బాబ్జి, కృష్ణమూర్తి, సూపర్వైజర్లు కోలా వెంకటేశ్వర్లు, సుకుమార్, గుర్తింపు సంఘం నాయకులు ఐ.శంకర్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.